మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి మరో హీరో
టాలీవుడ్ లోని స్టార్ హీరోలతో ఏషియన్ గ్రూప్ మెయిన్‌టెయిన్ చేసే రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏషియన్ సంస్థతో కలిసి మహేష్ ఏఎంబీ సినిమాస్ ను స్టార్ట్ చేశాడు. అది గ్రాండ్ సక్సెస్ అవడంతో బెంగుళూరులో కూడా మరో మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నారు. మహేష్ లానే అల్లు అర్జున్ కూడా ఏషియన్ తో కలిసి ఏఏఏ పేరుతో మల్టీప్లెక్స్ ను నిర్మించారు. విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లో ఇదే సంస్థతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటరయ్యాడు. రవితేజ దిల్ సుఖ్ నగర్ లో ఏఆర్టీ మల్టీప్లెక్స్ ను నిర్మించాడు. త్వరలోనే ఇది స్టార్ట్ కానుంది. ఇప్పుడు వీళ్ల దారిలో మరో టాలీవుడ్ హీరో ఈ మల్లీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాడు. అతను మరెవరో కాదు నితిన్.
ఏషియన్ గ్రూప్ తో కలిసి నితిన్ సంగారెడ్డిలో ఓ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే దానికి సంబంధించిన నిర్మాణం పూర్తైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ తో ఈ మల్టీప్లెక్స్ ను లాంచ్ చేయించాలని నితిన్ ఆలోచిస్తున్నాడట. పవన్ లాంచ్ చేస్తే ఆ మల్టీప్లెక్స్ కు మంచి హైప్ రావడం ఖాయం. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న నితిన్ తండ్రి ఇప్పుడు ఈ థియేటర్ బిజినెస్ లోకి ఎంటరవుతున్నాడు.













