మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో క్యూట్ స్టార్ నితిన్ నటించనున్నాడా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాతగా భోళా శంకర్ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అందులో ఓ యువ కథానాయకుడు నటించబోతున్నాడని టాక్. ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని నటించబోతున్నాడా! అంటే అవుననే సమాధానం సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అసలు ఇంతకీ ఎవరా పవర్ స్టార్ అభిమాని అనే సందేహం కలగక మానదు. ఇండస్ట్రీలో పవన్ వీరాభిమానులు చాలా మంది ఉన్నప్పటికీ .. హీరో నితిన్ అందులో సపరేట్. తనకంటూ హీరోగా ఓ ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా తను మాత్రం పవన్‌కు వీరాభిమాని. మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీలో నితిన్ చేయబోతున్నాడంలూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే, మెగాస్టార్ నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార, టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్యదేవ్, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ కు అధికారిక రీమేక్‌గా మోహన్ రాజా రూపొందిస్తున్నారు. ఇక మెగాస్టార్ హీరోగా నటిస్తున్న మరో మాస్ ఎంటర్టైనర్ భోళా శంకర్ తమిళంలో అజిత్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ వేదాళం మూవీ తెలుగు రీమేక్‌గా భోళా శంకర్ రూపొందుతుండగా మెహర్ రమేశ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా , ఆయనకు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ మొదలై శరవేగంగా సాగుతోంది. అయితే ఇదే సినిమాలో యూత్‌స్టార్ నితిన్ కూడా నటించబోతున్నట్టు తాజా సమాచారం. కీర్తి సురేష్ పాత్రకు జంటగా నితిన్‌ను మేకర్స్ ఎంచుకున్నారట. ఇంతకముందు నితిన్ – కీర్తి సురేశ్ కలిసి రంగ్ దే సినిమాలో జంటగా నటించారు. మరోసారి నితిన్ – కీర్తిల జంట నటిస్తున్నారనగానే అభిమానుల్లో ఆసక్తి బాగానే ఏర్పడింది. ఇక ఈ సినిమా మెగాస్టార్ నటిస్తున్నది కావడంతో అంచనాలూ బాగానే ఉన్నాయి. మరి భోళా శంకర్ సినిమాలో నితిన్ నటించే విషయమై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.













