నాని, వెంకీలతో నితిన్ పోటీ
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఎక్షట్రా ఆర్డినరీ మ్యాన్ అనే టైటిల్ ను లాక్ చేసి రీసెంట్గా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా డిసెంబ్ర 23న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయాన్ని కూడా టైటిల్ తో పాటే రివీల్ చేశారు.
అయితే కరెక్ట్ గా అదే టైమ్‌లో క్రిస్మస్ ను టార్గెట్ చేసుకుని నాని హాయ్ నాన్న, వెంకటేష్ సైంధవ్ సినిమాలు రిలీజ్‌ను షెడ్యూల్ చేసుకున్నాయి. ఈ విషయం తెలిసి కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ను దింపుతున్నారంటే నితిన్ నిర్మాతలు రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి. ఈ మూడు సినిమాలూ వేర్వేరు జానర్ల సినిమాలైనప్పటికీ ఓపెనింగ్స్ విషయంలో మాత్రం ఇబ్బంది కలగకుండా ఉండదు.
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో డైరెక్టర్ గా మారిన వక్కంతం వంశీ ఆ సినిమా రిజల్ట్ తో చాగా గ్యాప్ తీసుకుని ఇన్నేళ్లకు మళ్లీ నితిన్ సినిమా కోసం మెగాఫోన్ పట్టాడు. ఈ సినిమాలో నితిన్ క్యారెక్టర్ ను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడని, రేసు గుర్రం తరహా ఫన్ ను ఈ సినిమాలో పెట్టాడని ఇన్సైడ్ టాక్. ఈ సినిమా హిట్ వక్కంతం వంశీతో పాటూ నితిన్ కు కూడా చాలా అవసరం. కొత్తగా ట్రై చేసిన ప్రతి సారీ దెబ్బై పోతున్న నితిన్ తన పంథాలోకి వచ్చి చేస్తున్న సినిమా ఇది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు.













