నితిన్ కొత్త చిత్రం ప్రారంభం
యూత్‌స్టార్ నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. తెలుగుచిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో అందరినీ అలరించే చిత్రాలను తెరకెక్కిస్తున్న భవ్య క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తొలి సన్నివేశానికి చిత్ర నిర్మాత వి.ఆనంద ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. నిర్మాత మాట్లాడుతూ యూత్‌స్టార్ నితిన్‌కు పక్కాగా సరిపోయే కథలో సినిమా ఉంటుందన్నారు. ఆయన కెరీర్లో ఇది చెప్పుకోదగ్గ సినిమా అవుతుందన్నారు. అన్నిరకాల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. కీరవాణి సంగీతం కూడా ఈ సినిమాకు ఎసెట్ అవుతుందన్నారు. త్వరలో షూటింగ్ విషయాలు తెలియజేస్తామన్నారు.













