నితిన్ మొదలెట్టాడు
సితార ఎంటర్టైన్మెంట్స్పై నితిన్ హీరోగా తెరకెక్కనున్న భీష్మ ఎట్టకేలకు మొదలైంది. ఈ ప్రాజెక్టును దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితమే ప్రాజెక్టు మొదలవ్వాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనట్టు నితిన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నేటి నుంచి సినిమా షూటింగ్ మొదలైదంటూ ట్విట్టర్లో షేర్ చేశాడు. ప్రేమ కథగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక కనిపించనుంది. ఇటీవలి కాలంలో సరైన హిట్లులేక ఇబ్బంది పడుతున్న నితిన్ ఈ కథతో తప్పకుండా హిట్టుపడుతుందన్న నమ్మకంతో ఉన్నాడు.













