ఆయనపైనే భారం వేసిన నితిన్
సినిమా చూశాక ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని థియేటర్ల నుంచి బయటకొస్తారంటూ నితిన్ తెగ ప్రచారం చేసిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. వీకెండ్ వరకు ఎలాగొలా లాక్కొచ్చిన ఎక్స్ట్రా సోమవారం మంచి కలెక్షన్స్ ను సాధిస్తుందని బయ్యర్లే నమ్మడం లేదంటే సినిమా పరిస్థితేంటన్నది అర్థం చేసుకోవచ్చు.
ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ను మాత్రమే నమ్ముకుని వక్కంతం వంశీ స్క్రిప్ట్ ను నితిన్ లైట్ తీసుకోవడం వల్ల వచ్చిన ఫలితమే ఇది. అప్పుడప్పుడు ఇలాంటివి ఏ హీరోకైనా జరుగుతుంటాయి కానీ నితిన్ గత పదేళ్లుగా ఇదే చేస్తూ హిట్ ఫార్ములా గురించి మర్చిపోయి దారి తప్పుతున్నాడు. దీనికి ముందు నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే సినిమా చేసి ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు.
గత పదేళ్లలో నితిన్ నుంచి వచ్చిన హిట్ సినిమాలు రెండే రెండు. త్రివిక్రమ్ తో చేసిన అ..ఆ, వెంకీ కుడుముల తో చేసిన భీష్మ. ఈ రెండూ తప్పించి మిగిలినవన్నీ మిస్ ఫైర్ అయినవే. దీంతో ఇప్పుడు నితిన్ తన ఆశలన్నీ వెంకీ కుడుములతో చేస్తున్న సినిమాపైనే పెట్టుకున్నాడు. ఆ సినిమా కూడా హీరోయిన్ మారిపోవడంతో కాస్త డల్ అయింది. ఏదేమైనా నితిన్ తన తర్వాతి సినిమాతో హిట్ అందుకోపోతే తన కెరీర్ కు డ్యామేజ్ అవడం ఖాయం.













