ఐకాన్, తమ్ముడు రెండూ వేర్వేరు కథలు
ఓ మై ఫ్రెండ్, వకీల్ సాబ్ సినిమాల డైరెక్టర్ వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ తో ఐకాన్ అనే సినిమాను తెరకెక్కించాలనుకున్న విషయం తెలిసిందే. పుష్ప2 స్టార్ట్ చేయకముందే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది. దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు కూడా. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
ప్రస్తుతం వక్కంతం వంశీతో ఎక్స్ట్రా సినిమా చేసిన నితిన్, ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా తర్వాత నితిన్, వేణు శ్రీరామ్ తో తమ్ముడు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బన్నీతో చేయాల్సిన ఐకాన్ సినిమానే వేణు, నితిన్ తో చేస్తున్నాడని గతంలో కొన్ని వార్తలు రాగా, నితిన్ వాటికి క్లారిటీ ఇచ్చాడు.
ఐకాన్ ఒక డిఫరెంట్ సినిమా అని, తను చేస్తుంది ఫ్రెష్ స్టోరీ అని, తమ్ముడు పేరుతో రానున్న ఆ సినిమా అన్నదమ్ముల సెంటిమెంట్ తో కొనసాగుతుందని నితిన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీంతో పాటూ ఈ సినిమాలో హీరోయిన్ గా కాంతార మూవీ ఫేమ్ సప్తమి గౌడ ఫైనల్ అయినట్లు కూడా నితిన్ తెలిపాడు. నితిన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే నితిన్ కోసం వేణు కొత్త స్క్రిప్ట్ రెడీ చేశాడని అర్థమవుతుంది. అంటే అన్నీ కుదిరితే భవిష్యత్తులో బన్నీతో ఐకాన్ సినిమా తెరకెక్కే ఛాన్స్ లు ఉన్నట్లే కనిపిస్తున్నాయి.













