జూనియర్ ఆర్టిస్ట్‌గా నితిన్
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్సట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. ఈ సినిమాలో నితిన్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సినిమా కాన్సెప్ట్ బ్యాక్ డ్రాప్ ఏంటనేది కూడా రివీల్ చేశారు.
ఈ సినిమాలో నితిన్ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో హైలైట్ గా ఉంటుందని, సినిమాలో కొంచెం టైమ్ నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని, ఆ ఎపిసోడ్స్ మొత్తం సినిమాను తర్వాతి స్థాయికి తీసుకెళ్తాయని చెప్తున్నారు. సినిమా మేకింగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సీన్స్ చాలా ఫన్నీగా వచ్చాయని, ఈ సీన్స్ ఉండేది కాసేపే అయినా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయని ఇన్సైడ్ టాక్. భీష్మ తర్వాత నితిన్‌కు ఇప్పటికీ మరో హిట్ పడింది లేదు. ఎలాగైనా ఆ సినిమాతో సక్సెస్‌తో కొట్టాలని చూస్తున్నారు ఇటు నితిన్, అటు డైరెక్టర్ వక్కంతం వంశీ. మరి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ నితిన్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో కానీ నితిన్ ఆశలు మొత్తం ఈ సినిమాపైనే ఉన్నాయి.













