అమేజాన్ ప్రైం లోనే ‘నిశ్శబ్ధం’ విడుదలౌతుంది
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క లీడ్ రోల్ లో హేమంత్ మధుకర్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా నిశ్శబ్ధం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టిజి విశ్వ ప్రసాద్, కోనా ఫిల్మ్ కార్పోరేషన్ లో కోనా వెంకట్, ఈ సినిమాను నిర్మించారు. అంజలి, మాధవన్, షాలిని పాండే కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ సినిమా కొన్నాళ్ళుగా రిలీజ్ మర్చి లో జరగాల్సింది కానీ కరోనా సంక్షోభంలో ఆగిపోయింది. అప్పటినుండి సినిమాను ఓటిటి లో రిలీజ్ చేయాలా వద్దా అని నిర్మాత కోనా వెంకట్ పెట్టిన పోల్ కు యాభై శాతానికి పైగా ప్రేక్షకులు ఓటిటిలో రిలీజ్ చేయమని కోరారు. అందుకే నిశ్శబ్ధం ఓటిటి లో రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది.
తెలుస్తున్న సమాచారం ప్రకారం నిశ్శబ్ధం సినిమా అమేజాన్ ప్రైం వారు 25 కోట్లకు కొనేశారట. సెప్టెంబర్ రెండవ వారంలో సినిమా రిలీజ్ ఉంటుందని టాక్. అదే జరిగితే ఓటిటిలో రిలీజ్ అయ్యే క్రేజీ సినిమాగా అనుష్క నిశ్శబ్ధం అవుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే నాని వి సినిమాను కూడా ఓటిటి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. వి సినిమాకు అత్యధికంగా 33 కోట్ల దాకా అమేజాన్ ప్రైం ఆఫర్ చేసిందని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా నిశ్శబ్ధం కూడా ఓటిటి రిలీజ్ కు రంగం సిద్ధం చేసుకుంటుంది. సెప్టెంబర్ సెకండ్ వీక్ లో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. సినిమాలో అనుష్క చెవిటి, మూగ అమ్మాయి పాత్రలో నటిస్తుంది. భాగమతి తర్వాత అనుష్క చేసిన ఈ సినిమాపై అంచనాలైతే భారీగానే ఉన్నాయి. మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా రిలీజ్ పై ఇన్నాళ్ళు అనుష్క కూడా మౌనంగా ఉంటూ వచ్చింది.













