‘నిశ్శబ్దం’ వీడింది గాందీ జయంతి రోజున అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల
ఎట్టకేలకు ‘నిశ్శబ్దం’ గా ఓ టి టి వేదిక లో అలరించనుంది అనుష్క ప్రధాన పాత్ర పోషించిన ‘నిశ్శబ్దం’. నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో దర్శనమివ్వనుంది. ‘నిశ్శబ్దం’ విడుదలని అమెజాన్ ప్రైమ్ రిలీజ్ డేట్ ని ప్రకటించింది. అనుష్క ప్రధాన పాత్ర పోషించిన ప్రయోగాత్మక చిత్రం ‘నిశ్శబ్దం’. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. కోన ఫిల్మ్ కార్పోరేషన్ అసోసియేషన్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయాలని మొదట భావించారు. కానీ కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా ఆగిపోయింది. పరిస్థితులు చక్కబడి థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాకే ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు మొదట భావించారు. కానీ, ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు లేవు. ఇప్పటికే కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి.
ఇటీవల నాని ‘V’ చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. అందుకే, ఇక థియేటర్ రిలీజ్ కోసం వేచిచూడకుండా ‘నిశ్శబ్దం’ను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రాన్ని డిజిటల్ రైట్స్‌ను సైతం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ మేరకు చిత్ర విడుదల తేదీని శుక్రవారం అమెజాన్ ప్రకటించింది. అక్టోబర్ 2న ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ ప్రసారం కానున్నట్టు అమెజాన్ వెల్లడించింది.













