నిన్ను తలచి ట్రైలర్ విడుదల చేసిన బోయపాటి
వంశీ ఎక్కసిరి, స్టెఫీ పాటిల్ జంటగా నటిస్తున్న చిత్రం నిన్ను తలచి. అనిల్ తోట దర్శకుడు. ఏలేంద్ర మహవీర సంగీతం అందించారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకువస్తున్న నిన్ను తలచి చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ నిన్ను తలచి టైటిల్లోనే పాజిటివ్ ఎనర్జీ ఉంది. మంచి సినిమాను అందరూ ప్రోత్సహించాల్సిందే. ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేసినపుడు దర్శ నిర్మాతలు సగం సక్సెస్ అయ్యారని ప్రశంసించారు. చిత్ర దర్శకుడు అనిల్ తోట మాట్లాడుతూ పాటలకు మంచి స్పందన వస్తోంది. అంతా పాజిటివ్‌గా ముందుకు వెళుతున్నాం. డిఓపి శ్యామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం, శ్రీమణి, పూర్ణాచారి సాహిత్యం బాగా అందించారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్మతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో వంశీ, హీరోయిన్ స్టెఫీ పటేల్, సంగీత దర్శకుడు ఎలెందర్ మహావీర్ కూడా సినిమా గురించి మాట్లాడారు.













