స్పైని ఏం చేస్తారో?
నిఖిల్ హీరోగా, ప్రముఖ ఎడిటర్ గ్యారీ దర్శకుడిగా మారి తెరకెక్కిన సినిమా స్పై. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా ఫిల్మ్ గా ఎన్నో సస్పెన్స్ ల మధ్య ఈ నెల 29న రిలీజ్ కానున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మొన్నటి వరకు కూడా ఈ సినిమాకు కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇంకా డబ్బింగ్ కూడా ఫినిష్ కాలేదని వార్తలొచ్చాయి.
దానికి తోడు రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్లకు టైమ్ కూడా లేదని ఈ సినిమా కచ్ఛితంగా పోస్ట్ పోన్ అవడం ఖాయమని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసి అందరికీ షాకిచ్చారు. ఇప్పుడంతా ఆదిపురుష్ మానియా నడుస్తుంది. దీని నుంచి స్పై మూడ్ లోకి వచ్చి, ఆ సినిమా వస్తుందని జనాలకు రిజిస్టర్ కావాలంటే ఈ లోపు భారీ ప్రమోషన్స్ చేయాల్సి ఉంది.
ఇన్ని పనులను పెండింగ్ లో పెట్టుకుని మరి ఇంత తక్కువ టైమ్ లో ఎలా చేయగలరనేది ఆసక్తికరంగా మారింది. దీనికి హీరో నిఖిల్ ఏ మేర సపోర్ట్ చేస్తాడనేది చూడాల్సి ఉంది. 1945 ఫ్లైట్ క్రాష్ లో అంతర్ధానమైన సుభాష్ చంద్ర బోస్ మిస్టరీ మరణం చుట్టూ ఈ స్పై స్టోరీ నడవనుంది. ట్రైలర్ చూస్తుంటే సస్పెన్స్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నట్లు అనిపిస్తుంది. మరి ఇన్ని అంశాల నడుమ స్పై ఏ మేరకు ప్రేక్షకులకు రీచ్ అవుతుందో చూడాలి.













