డిసెంబర్ 28న ముద్ర
నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ముద్ర. ఈ చిత్రాన్ని డిసెంబర్ 28న విడుదల చేయనున్నారు. వాస్తవిక సంఘటనలు ఆధారంగా జర్నలిజం నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా ఇది. సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలను మీడియా ఎలా పరిష్కరిస్తోంది. అందులో మీడియా బాధ్యతను గుర్తు చేస్తూ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు టిఎన్ సంతోష్. సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. తొలి సారి నిఖిల్ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నాడు. అతడి బర్త్‌డే కానుక విడుదలైన ఫస్ట్‌లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లావణ్య త్రిపాఠి తొలిసారి నిఖిల్‌తో జోడీకట్టింది. ఔరా సినిమాస్ పివిటి మరియు మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పి సంస్థలపై కావ్య వేణుగోపాల్, రాజ్‌కుమార్ ముద్ర సినిమా నిర్మిస్తున్నారు. బి మధు చిత్రానికి సమర్పకుడిగా ఉన్నారు. డిసెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకానుంది.













