18 పేజీస్ ప్రారంభం
నిఖిల్ హీరోగా రూపొందుతున్న సినిమా 18 పేజెస్. ఈ సినిమా చిత్రీకరణ ఫిల్మ్‌నగర్ ఆలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్రీకరించిన మొదటి సన్నివేశానికి అల్లు అర్జున్ కుమార్తె బేబి అల్లు అర్హ క్లాప్ కొట్టింది. నిర్మాత బన్నివాసు కుమార్తే బేబి హన్విక స్విచ్ ఆన్ చేసింది. ఈ చిత్రాన్ని బన్నివాసు నిర్మిస్తున్నారు. సుకుమార్ మొదటి షాట్‌కి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణ. జిఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్త నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, బన్ని వాసు, నిఖిల్ పాల్గొన్నారు.













