నిఖిల్ కెరీర్ లో కార్తికేయ తరహాలో మరో సినిమా…
యూత్ స్టార్ నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ, కార్తికేయ 2 తన కెరీర్ లో మర్చిపోలేని సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. విభిన్న కథా కథనాలతో రూపొందించిన ఈ చిత్రాలు ప్రేక్షకులను బాగానే మెప్పించాయి.
ముఖ్యంగా కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు మార్కెట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో చాలా క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. దీంతో ముందు ముందు నిఖిల్ నుండి పాన్ ఇండియా మూవీస్ మనం ఎక్సపెక్ట్ చేయొచ్చు.
ప్రస్తుతం 18 పేజెస్ సినిమాతో ఈ హీరో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇప్పటికే ప్రకటన వచ్చింది. ఈ సినిమా తర్వాత స్పై మూవీ తో నిఖిల్ రెడీ గా ఉన్నాడని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
కార్తికేయ 2 సినిమా తరహాలోనే పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఒక విభిన్నమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారట. కార్తికేయ 2 సినిమా తరహాలోనే ఆ సినిమా ఉంటుందని అంటున్నారు. ఒక భారీ బడ్జెట్ మూవీగా ఆ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట.
ఠాగూర్ మధు నిర్మాణంలో రూపొందబోతున్న ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరగుతోంది. ఇంకా దర్శకుడి విషయంలో క్లారిటీ రాలేదు. కానీ కొత్త దర్శకుడు అనే వార్తలు మాత్రం వస్తున్నాయి. ఠాగూర్ మధు చాలా నమ్మకంతో ఈ సినిమాను నిర్మించబోతున్నాడట.













