హీరో నిఖిల్ గౌడ్ వివాహం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తనయుడు జాగ్వార్ హీరో నిఖిల్ గౌడ్ వివాహం శుక్రవారం రేవతితో జరిగింది. బెంగళూరుకు పొరుగున ఉన్న రామనగరం జిల్లాలోని కేతగానిహళ్లిలో కుమారస్వామి ఫామ్‌హౌస్‌లో ఈ వేడుకను వేదికైంది. తన తనయుడి వివాహాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని కుమారస్వామి తొలుత 8 లక్షల వివాహ ఆహ్వాన పత్రికలను అచ్చు వేయించారు. రామనగర జిల్లాలో పెద్ద సంఖ్యలో ప్రజలను దీనికి ఆహ్వానించాలని భావించారు. అయితే లాక్‌డౌన్‌తో ఈ కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. 50 నుంచి వంద మంది వరకూ కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. మాజీ ప్రధాని దేవెగౌడ చెన్నమ్మ దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా వివాహ వేడుకల్లో భౌతిక దూరం పాటించకుండా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్టు పేర్కొంటూ కర్నాటక సీఎం యాడ్యూరప్ప విచారణకు ఆదేశించారు.













