ఓ తమిళ చిత్రానికి నిహారిక గ్రీన్ సిగ్నల్
2019లో విడుదలైన సూర్యకాంతం తర్వాత కొత్త సినిమాలపై సంతకం చేయలేదు నిహారిక కొణిదెల. కథాంశాలు, పాత్రల ఎంపికలో పునరాలోచనలో పడిన ఆమె ఏడాదిపైనే విరామం తీసుకుంది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం నిహారిక ఓ తమిళ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అశోక్ సెల్వన్ కథానాయకుడిగా కెనన్య ఫిల్మస్ పతాకంపై ఓ తమిళ చిత్రం తెరకెక్కనుంది. స్వాతిని దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో నిహారిక కొణిదెల కథానాయికగా నటించనుంది. తమిళ సినిమా అంగీకరించిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా ధృవీకరించింది నిహారిక కొణిదెల. షూటింగ్ ఆరంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ తమిళ చిత్రం రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. తమిళంలో నిహారిక నటిస్తున్న రెండో సినిమా ఇది. 2018లో విజయ్‌సేతుపతి కథానాయకుడిగా రూపొందిన ఒరు నల్ల నాల్ పాతు సొల్రేన్ సినిమాలో నిహారిక కీలక పాత్రలో నటించింది. సైరాలో అతిథి పాత్రలో మెరిసింది నిహారిక.













