సక్సెస్ సెంటిమెంట్ ను నమ్ముకున్న నిహారిక
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే టాలీవుడ్ నుంచి ఎంతోమంది హీరోలొచ్చారు. వారిలో చాలా వరకు సక్సెస్ కూడా అయ్యారు. కానీ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక్కగానొక్క అమ్మాయి నిహారిక. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాల్లో హీరోయిన్ గా నటించిన నిహారికకు సక్సెస్ మాత్రం దక్కలేదు. తమిళంలో కూడా ఒక సినిమా చేసింది కానీ అది కూడా సరిగా ఆడలేదు.
దీంతో యాక్టింగ్ కు దూరమై, తన అక్క సుశ్మిత బాటలోనే నిర్మాతగా తన లక్ ను టెస్ట్ చేసుకుంటుంది. నిహారిక నిర్మాతగా మారి చేస్తున్న మొదటి సినిమా కమిటీ కుర్రాళ్లు ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాదు వంశీ అనే కొత్త డైరెక్టర్ తో అందరూ కొత్త వాళ్లతో ఈ సినిమాను తెరకెక్కించింది నిహారిక. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక మీడియాతో ముచ్చటించిన నిహారిక ఒక సక్సెస్ సెంటిమెంట్ గురించి చెప్పుకొచ్చింది.
ఈ ఇయర్ తన ఫ్యామిలీకి బాగా కలిసొస్తుందని నిహారిక చెప్పింది. తన అన్న రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చిందని, పెదనాన్న చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిందని, తన బాబాయి డిప్యూటీ సీఎం అయ్యారని, ఈ సెంటిమెంట్ లో భాగంగానే తను కూడా నిర్మాతగా సక్సెస్ అందుకుంటానని ధీమా వ్యక్తం చేస్తోంది నిహారిక. ఈ సినిమా సక్సెస్ విషయంలో నిహారిక చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.













