ఆ కారణంతోనే చాలా అవకాశాలు కోల్పోతున్నా- నిహారిక
రొమాంటిక్ డ్రామాగా వచ్చిన కలర్ ఫోటో సినిమాకు నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. సుహాస్, చాందినీ చౌదరి జంటగా వచ్చిన ఈ సినిమా కమర్షియల్ హిట్ అవకపోయినా నేషనల్ అవార్డు రావడంతో సినిమా బాగా ఫేమస్ అయింది. ఈ సినిమాకు పని చేసిన వారంతా కొత్త వాళ్లే. థియేటర్లో ఉన్నప్పుడు పెద్దగా ఆదరణ లేని ఈ సినిమా తర్వాత మాత్రం బాగా పాపులరైంది.
నేషనల్ అవార్డు రావడంతో అందరూ ఈ చిత్ర యూనిట్ ను సత్కరిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇలాంటి సినిమాలో తనకు ఛాన్స్ వస్తే మాత్రం అసలు వదులుకునేదాన్ని కాదని తాజాగా నిహారిక ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. నటిగా తానెప్పుడూ కథలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని, తన పాత్ర చిన్నదా, చిన్న హీరోనా అనేది చూడనని చెప్పింది.
చాలామంది డైరెక్టర్లు నిహారిక కేవలం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తుందని, చిన్న హీరోల సరసన నటించదనుకుంటున్నారని, ఆ డౌట్ తోనే చాలా మంది తనకు కథలు వినిపించడం లేదని తెలిపింది. కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా నిహారికనే అనుకున్నాడట. కానీ సుహాస్ పక్కన చేస్తుందా లేదా అనే డౌట్ తో ఆమె దగ్గరకు వెళ్లలేదని ఈ సందర్భంగా నిహారిక చెప్పింది. మొత్తానికి నిహారిక ఇలాంటి రీజన్స్ తో ఎన్నో మంచి అవకాశాలు కోల్పోయిందని అర్థమవుతుంది. మరి నిహారిక తన మనసులోని మాటను బయట పెట్టింది కాబట్టి ఇకనైనా తనను డైరెక్టర్లు సంప్రదిస్తారేమో చూడాలి.













