Niddhi Agerwal: నిధి డ్రీమ్ మల్టీస్టారర్ కాంబో ఏంటంటే?
టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్లలో నిధి అగర్వాల్(Niddhi Agerwal) కూడా ఒకరు. ఈ ఇయర్ నిధి నుంచి హరి హర వీరమల్లు(Hari hraa veeramallu) సినిమా రాగా, ఆ సినిమా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో ఫెయిలైంది. ప్రస్తుతం మారుతి(Maruthi) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) సరసన రాజా సాబ్(The Raja Saab) లో హీరోయిన్ గా నటించిన నిధి, ఈ చిత్ర ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది. ఈ సందర్భంగా నిధి ఎక్స్ లో చాట్ సెషన్ నిర్వహించి అందులో ఫ్యాన్స్ అడిగిన కొన్ని విషయాలకు సమాధానాలిచ్చింది.
అందులో భాగంగానే తన మనసులోని ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి నిధి మాట్లాడింది. తనకు పవన్ కళ్యాణ్(pawan Kalyan), ప్రభాస్(prabhas) తో ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలనుందని, ఆ సినిమాకు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించాలని, అందులో హీరోయిన్ గా తాను నటించాలనుకుంటున్నట్టు నిధి వెల్లడించింది. ఇప్పటికే పవన్(Pawan Kalyan), ప్రభాస్ ల గురించి ఎన్నో సందర్భాల్లో నిధి చాలా గొప్పగా చెప్పుకొచ్చింది.
వారితో వర్క్ చేస్తున్నప్పుడు ఆ హీరోల యాటిట్యూడ్ కు ఫ్యాన్ అయిపోయానని చెప్పిన నిధి అందుకే వారితో మళ్లీ మళ్లీ వర్క్ చేయాలనుకుంటున్న విషయాన్ని వెల్లడించింది. అయితే నిధి కోరిక చిన్నదేమీ కాదు. ఓ వైపు పవన్ తన పనులతో తాను బిజీగా ఉంటే, మరోవైపు ప్రభాస్ వరుస సినిమాలతో మరింత బిజీగా ఉన్నారు. అలాంటి వీరిద్దరితో మల్టీస్టారర్ అంటే కష్టమనే చెప్పాలి.






