మెగా హీరోకు జోడీగా నిధి అగర్వాల్
మెగా ఫ్యామిలీ నుంచి సాయిధరమ్‌తేజ్ తమ్ముడు వైష్టవ్‌తేజ్ హీరోగా పరిచయం కానున్నాడనే విషయం తెలిసిందే. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రంలో సవ్యసాచి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ నిధి అగర్వాల్, వైష్టవ్‌కు జోడీగా నటించనుంది. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబు సాన ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రానున్న ఈ చిత్రం త్వరలోనే గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.













