నిధి అగర్వాల్‌కు బంపర్ ఆఫర్
రవితేజ హీరోగా ఓ స్టూడియోస్ పతాకంపై హవీస్ ప్రొడక్షన్లో ఒక చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాత సత్యనారాయణ కోనేరు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఒక హీరోయిన్గా ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్‌కు ఎంపిక చేశారు. మరో హీరోయిన్ను త్వరలో ప్రకటించనున్నారు. మే నెలాఖరు నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది.













