పవనే కాదు, తన గర్ల్ ఫ్రెండ్ కూడా దొంగే..
పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో వస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ హరిహర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై దయాకర్ రావు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కు జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ ను శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయగా.. ఆ రెండూ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. వీరమల్లు ఒక దొంగ అనే క్లారిటీ కూడా వచ్చింది. 17వ శతాబ్ధం కథతో రూపొందుతున్న ఈ సినిమాలో వీరమల్లు కోహినూరు వజ్రం దొంగిలించడానికి ప్రయత్నిస్తుంటాడని, ఈ సినిమాలో హీరో తో పాటూ హీరోయిన్ కూడా దొంగే అని టాక్ నడుస్తుంది.
పవన్ తో ఒక సిట్యుయేషన్ లో పోరాటానికి దిగిన నిధి అగర్వాల్ కూడా ఈ సినిమాలో దొంగగా కనిపిస్తుందట. పవన్, నిధిల మధ్య వచ్చే సీన్స్ ను చాలా వినోదాత్మకంగా రాశారట క్రిష్. నిధి కాకుండా జాక్వెలిన్ ఫెర్నాండజ్ కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కనిపించనుందంటున్నారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సోదరిగా, హీరోను చూసిన వెంటనే ప్రేమలో పడే క్యారెక్టర్ గా ఆమె ఈ సినిమాలో కనిపించనుందని టాక్. పవన్ కెరీర్లోనే ఫస్ట్ పీరియాడికల్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో మొగలాయిల కాలం నాటి దర్బార్ సెట్ వేసినట్లు తెలుస్తుంది. పవన్ కెరీర్ లోనే హరిహర వీరమల్లు ఎక్కువ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా. 2022 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.













