మా మధ్య అలాంటిదేమీ లేదు
గత కొన్ని రోజులుగా తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు సవ్యసాచి హీరోయిన్ నిధి అగర్వాల్. ఇండియా క్రికెటర్ కే.ఎల్ రాహుల్ తో ప్రేమలో వున్నారని వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరు కలిసి బయట కనిపించడంతో ఈ వార్తలు నిజమేనని ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలపై జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన నిధి, తను రాహుల్ చిన్నప్పటినుండి మంచి స్నేహితులమని, తరుచు కలుస్తామని, అంతే తప్ప తామిద్దరం డేటింగ్లో ఉన్నామని వస్తున్న వార్తలు రూమార్స్ మాత్రమే అని తేల్చి చెప్పింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ నాగ చైతన్య సరసన సవ్యసాచి సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో నిధి టాలీవుడ్‌కి పరిచియమవుతోంది. ఈ సినిమా తరువాత అఖిల్ అక్కినేనితో మరో చిత్రంలో నటించనుంది నిధి.













