రొమాంటిక్ పాత్రలే ఇష్టం : నిధి అగర్వాల్
సూపర్‌హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ లో సైంటిస్ట్‌గా నటించింది అందాల భామ నిధి అగర్వాల్. ఆమె చేసిన మూడు సినిమాల్లో మంచి పేరు తెచ్చిన క్యారెక్టర్ ఇది. అయినప్పటికీ తనకు ఇలాంటి పాత్రల కంటే రొమాంటిక్ పాత్రలే ఇష్టమని అంటోంది నిధి. నాకు ఎక్కువగా రొమాంటిక్ సినిమాలే నచ్చుతాయి. ఆ జోనర్ సినిమాలే చూడటానికి ఇష్టపడతాను. అందుకే హీరోయిన్గా ఎక్కువగా రొమాంటిక్ సినిమాలే చేయాలనుకుంటున్నాను అని చెప్పింది నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ ఘన విజయం సాధించడంతో ఈ భామకు మంచి అవకాశాలు వస్తున్నాయట. వీటిలో గ్లామర్ పాత్రలు ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. ఇప్పటికే ఓ తమిళ సినిమాకు కమిట్ అయిన నిధి అగర్వాల్ తెలుగులో రెండు, మూడు సినిమాల్లో నటించనుంది.













