‘ఇస్మార్ట్ శంకర్’ కథానాయికగా నిధి అగర్వాల్
దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇందులో కథానాయికగా నిధి అగర్వాల్ నటించనున్నట్లు సోమవారం ప్రకటించారు. ‘మా ‘ఇస్మార్ట్’ కుటుంబంలోకి నిధి అగర్వాల్‌కు స్వాగతం’ అని నటి ఛార్మి ట్వీట్ చేశారు. దీంతోపాటు పోస్టర్‌ను షేర్ చేశారు. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ, ఛార్మి సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం రామ్ మరింత ఫిట్‌గా తయారయ్యారు. ఇందులో ఆయన విభిన్నమైన మాస్ పాత్రలో కనిపించనున్నారట. తెలుగులో ఆమె తొలి సినిమా ‘సవ్యసాచి’. అఖిల్‌కు జోడీగా నటించిన ‘మిస్టర్ మజ్ను’ సినిమా ఇటీవల విడుదలైంది.













