హరిహర వీరమల్లు లో పంచమిగా నిధి అగర్వాల్
పవన్ కల్యాణ్ హీరో, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తున్న మాగ్నమ్ పవన్ ఫిల్మ్ హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ నాయిక. యోగా సూర్యాప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎఎం రత్నం సమర్పణలో నిర్మాత దయాకర్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ పంచమి అనే పాత్రలో కనిపిస్తుంది. కృష్ణపక్ష పంచమి వెన్నెల వన్నెలవా, శుక్ల పక్ష పంచమి నెలవంక వయ్యా రానివా? ఓ అందాల పంచమి, ఎవరివే నీవెవరివే అని అమె అందాల్ని అభివర్ణించవొచ్చు. భారతీయ సినిమాలో ఓ విభిన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయబోతున్నాం. యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తాం అని చిత్ర బృందం తెలిపింది. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల శకం నేపథ్యంలో జరిగే కథల అద్భుతంగా విజువల్ ఫీస్ట్‌గా ఈ హరిహర వీరమల్లు సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : జ్ఞానశేఖర్ వి.ఎస్, సంగీతం: ఎం.ఎం. కీరవాణి.













