Nidhhi Agerwal: రాజా సాబ్లో నా పాత్ర సర్ప్రైజ్ చేస్తుంది: నిధి అగర్వాల్
ప్రభాస్(Prabhas)- మారుతి(Maruthi) కలయికలో వస్తున్న ది రాజా సాబ్(The Raja Saab) సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకున్నా షూటింగ్ లేటవడం వల్ల సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొదట్లో ఈ సినిమాపై అసలు అంచనాలే లేవు. కానీ క్రమంగా ఆ అంచనాలను మారుతి పెంచుకుంటూ వచ్చాడు. మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్(Nidhhi Agerwal), రిద్ది కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న నేపథ్యంలో వారిలో మెయిన్ లీడ్ గా మాళవిక మోహనన్ గ్లామర్ పాత్రలో కనిపించనుందని ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇదిలా ఉంటే రాజా సాబ్ లో తన పాత్ర ఎలా ఉంటుందోననే విషయాన్ని తాజాగా నిధి అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెల్లడించింది.
ఇ్పటివరకు తాను చేసిన గ్లామర్ పాత్రలను చూసి అందరూ తాను రాజా సాబ్లో కూడా అలాంటి పాత్రే చేస్తున్నా అనుకుంటున్నారని, కానీ రాజా సాబ్ లో తాను డీ గ్లామర్ రోల్ లో కనిపించడంతో పాటూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించనున్నట్లు తెలిపింది. అంతేకాదు రాజా సాబ్ లో తన పాత్రను చూసి ప్రతీ ఒక్కరూ సర్ప్రైజ్ అవుతారని, ఈ సినిమా తర్వాత తనపై ఆడియన్స్ కు ఉన్న అభిప్రాయం మారుతుందని నిధి ఆశాభావం వ్యక్తం చేసింది.













