Niddhi Agarwal: కెరీర్ గ్యాప్ కు రీజన్ చెప్పిన నిధి
నిధి అగర్వాల్(Naddhi Agarwal) బిగ్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులైంది. తెలుగులో అమ్మడు సినిమా చేసి దాదాపు మూడేళ్లు దాటింది. పవన్(Pawan Kalyan), ప్రభాస్(Prabhas) లాంటి ఇద్దరు స్టార్ హీరోల సరసన పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న నిధి అవి కాకుండా మరే సినిమాను చేయట్లేదు. అయితే హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu), రాజా సాబ్(Raja Saab) రెండూ సెట్స్ పైనే ఉన్నాయి.
ఆ సినిమాలు ఎప్పుడు రిలీజవుతాయనేది తెలియదు కానీ నిధి మాత్రం మరో సినిమాకు సైన్ చేసింది లేదు. అయితే నిధి ఇండస్ట్రీకి వచ్చాక ఇంత గ్యాప్ ఎప్పుడూ రాలేదు. ఈ నేపథ్యంలో తన కెరీర్లో గ్యాప్ రావడంపై అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెస్పాండ్ అయింది. తాను గ్యాప్ ఇవ్వలేదని, గ్యాప్ వచ్చిందని నిధి తెలిపింది.
మొదటి లాక్డౌన్ కు ముందే వీరమల్లు సినిమాకు సైన్ చేసిన నిధి ఆ సినిమా పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్టు ఒప్పుకోకూడదనే కాంట్రాక్ట్ మీద సైన్ చేసినట్టు తెలిపింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆయన షూటింగ్ కు డేట్స్ ఇచ్చినప్పుడు తాను కూడా అందుబాటులో ఉండాలనే కారణంతో టీమ్ ఆ ఆంక్ష పెట్టినట్టు అమ్మడు వెల్లడించింది. అందుకే ఆఫర్లు ఎన్ని వచ్చినా ఏదీ ఒప్పుకోలేదని నిధి వెల్లడించింది.













