శుభవార్త చెప్పిన ప్రియాంక శ్రీవారు
ప్రియాంక చోప్రా హాలీవుడ్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా గడుపుతోంది. ఇప్పుడు ఆమె భర్త, హాలీవుడ్ నటుడు నిక్ జొనాస్ కూడా తన కొత్త చిత్రం కబురు చెప్పేశారు. 2017లో వచ్చిన జుమాంజి వెల్కమ్ టు ది జంగిల్‌కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు నిక్. జుమాంజి అనే వీడియో గేమ్ ఆడే నలుగురు టీనేజ్ కుర్రాళ్లు అనుకోకుండా అందులోని పాత్రధారుల్లా మారిపోయి అడవిలో చిక్కునే కథతో జుమాంజి తెరకెక్కింది. అందులో డ్వేన్ జాన్సన్, కెవిన్ హార్ట్ వంటి ప్రముఖ నటులతో పాటు నిక్ కూడా నటించారు. అలెక్స్ అనే కుర్రాడిగా కనిపించి మెప్పించారు నిక్. ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైంది. ఇప్పుడు చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. తొలి జుమాంజి ని తెరకెక్కించిన జేక్ కాస్డన్ దర్శకత్వం వహించనున్నారు. రెండో జుమాంజీ లోనూ నిక్‌తో సహా ప్రధాన పాత్రధారులంతా మళ్లీ అవే పాత్రలో కనిపించనున్నారు. జుమాంజి సీక్వెల్ రాబోతోంది. మళ్లీ అలెక్స్ పాత్రను పోషిస్తున్నానని తెలిపారు నిక్. డిసెంబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.













