కొత్తజంట సంచలనం
పిసి ఆలియాస్ ప్రియాంక చోప్రా, బ్రిటీష్ మహారాణికి రాన్నంత ప్రచారం సొంతం చేసుకుంది. విదేశీ గాయాకుడు, నటుడు నిక్ జోనాస్‌ని ప్రేమించిన ఈ భామకు యూట్యూబ్, సామాజిక మాధ్యమాల్లో అసాధారణ ప్రచారం దక్కింది. నిన్నగాక మొన్ననే ప్రియుడు నిక్ జోనాస్‌ను పిసి మనువాడిన సంగతి తెలిసిందే. పెళ్లికిముందు తర్వాత ఈ జంట ఎంతగానో ఎంజాయ్ చేసింది. ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన కవర్ ఫొటో షూట్లో కొత్త జంట విన్యాసాలు ప్రస్తుతం యువతరాన్ని మైమరపిస్తున్నాయి. నిక్ జోనాస్‌తో పిసి హాట్ ఫొటోషూట్ ప్రస్తుతం వేడెక్కిస్తోంది. ఎంత ఘాటు ప్రేమయో అన్న తీరుగా పీసీ, నిక్ ఫోజులిచ్చారు. పెళ్లయి 24 గంటలు గడవకుండానే ఈ ఫోటోలు అంతర్జాలంలో సెగపుట్టించాయి. ఎట్టకేలకు జోధ్‌పూర్ ఉమైద్ భవన్లో పెళ్లితో ఈ జంట ఒక్కటైంది. ఈ ఫోటో షూట్లో పిసి, నిక్‌ల ఘాటైన కెమిస్ట్రీపై యువతలో వేడి చర్చ జరుగుతోంది.













