స్పిరిట్‌లో నెక్ట్స్ లెవెల్ వయొలెన్స్ అట!
యానిమల్ సినిమాతో తన సత్తా ఏంటో చూపించిన సందీప్ రెడ్డి వంగ తన తర్వాతి సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. స్పిరిట్ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ప్రభాస్‌తో సందీప్ చేయబోయే మూవీ గురించి ఇప్పటికే ఒక్కొక్కరు ఒక్కోలా ఊహించుకుంటున్నారు.
అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పటివరకు స్పిరిట్ ఏ జానర్ లో రూపొందనుందనేది మాత్రం సందీప్ ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, స్పిరిట్ మూవీలో వయొలెన్స్, అడల్ట్ సీన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయని, సినిమా మొత్తం సందీప్ బ్రాండ్ తోనే నడుస్తుందని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు తన ఫిల్మ్ మేకింగ్ తో ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యపరిచిన సందీప్, స్పిరిట్ తో తర్వాతి స్థాయికి వెళ్లనున్నాడని అర్థమవుతుంది.
ఇక్కడ ఆలోచించాల్సిన విషయం మరొకటి ఉంది. ప్రభాస్‌కు అన్ని రకాల ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి హీరో విజయ్ దేవరకొండ, రణ్‌బీర్ లాగా అడల్ట్ సీన్స్ లో నటిస్తే కచ్ఛితంగా విమర్శలొస్తాయి. అసలే ప్రభాస్ కు సిగ్గు ఎక్కువ. అలాంటి ప్రభాస్ ను సందీప్ రెడ్డి వంగ ఎలా డీల్ చేస్తాడో అని చూడ్డానికి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.













