కల్కి కోసం నెక్ట్స్ లెవెల్ ప్రమోషన్ ప్లాన్స్
సలార్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టుకున్న ప్రభాస్, తన తర్వాతి సినిమా అయిన కల్కి 2898ఏడిని మరో మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి హీరోగా వస్తున్న సినిమాలకు ప్రమోషన్స్ హడావిడి లాస్ట్ వీక్లో చేస్తున్నారు. దీంతో సినిమాకు సరైన పబ్లిసిటీ లేక ఓపెనింగ్స్ మీద ఆ ఎఫెక్ట్ పడుతుందని చాలా మంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది కల్కి టీమ్. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా కల్కి ప్రమోషన్స్ నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారట. అందులో భాగంగానే కామిక్ కాన్ ఫెస్టివల్ తో మొదలుపెట్టి హైదరాబాద్ లో ఫన్ ఎగ్జిబిషన్ వరకు ప్రతి చోటా రకరకాల ప్రోగ్రామ్స్ చేసి సినిమాపై హైప్ పెంచుతున్నారు.
రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ కూడా ఈ సినిమా తరపున తన వంతు హైప్ పెంచడంలో భాగమయ్యాడు. రీసెంట్ గా చెన్నైలో అతను నిర్వహించిన లైవ్ కన్సర్ట్ కు భారీగా మ్యూజిక్ లవర్స్ తరలి వచ్చారు. అక్కడ కల్కికి సంబంధించిన బీజీఎంలో కొంత భాగాన్ని స్పెషల్ గా ప్లే చేసి ఆడియన్స్ కు షాకిచ్చాడు. లైవ్ లో ఆ బీజీఎం విన్న వాళ్లు వావ్ అనకుండా ఉండలేకపోయారట. మొత్తానికి కల్కి ప్రమోషన్స్ ను ఓ ప్లానింగ్ ప్రకారం నాగ్ అశ్విన్ ప్లాన్ చేశాడు. ఈ సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.













