కల్కికు నెక్ట్స్ లెవెల్ ప్రమోషన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 ఏడీ. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్నప్పటికీ మేకర్స్ ఇంకా పూర్తి స్థాయి ప్రమోషన్స్ మొదలుపెట్టలేదని ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ ను పెంచాలనే విషయంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కల్కి ప్రమోషన్స్ లో భాగంగా కల్కి కథ పూర్వ పరిచయం, పాత్రలతో కూడిన ఓ చిన్న యానిమేటెడ్ సిరీస్ ను త్వరలోనే ఓటీటీ ద్వారా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నాడట నాగ్ అశ్విన్. ఒక్కో ఎపిసోడ్ 20 నిమిషాల దాకా ఉండేలా నాలుగు ఎపిసోడ్స్‌లో ఆయా పాత్రలకు ప్రభాస్ తో సహా కీలక పాత్రధారులే డబ్బింగ్ చెప్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో పాటూ మే 22న హైదరాబాద్ లో ఓ భారీ ఫ్యాన్ మీట్ పెట్టి హైప్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లనున్నారట. సలార్1 టైమ్ లో ఫ్యాన్స్ ను కలవడానికి ప్రభాస్ కి కుదరలేదు. దీంతో ఇప్పుడెలాగైనా ఫ్యాన్స్ ను కలవాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యాడట. అంతే కాదు కల్కికి సంబంధించి సాంగ్స్, టీజర్, ట్రైలర్ లాంటి వాటికి ఎక్కువ టైమ్ లేదు కాబట్టి టీమ్ పరుగులు పెట్టాల్సిందే. జూన్ ఫస్ట్ వీక్ లో ఎలక్షన్స్ రిజల్ట్స్ హడావిడి ఉంటుంది కాబట్టి ఆ రెండు మూడు రోజులు బ్రేక్ తీసుకుని ఆ తర్వాత క్రమం తప్పకుండా కల్కి నుంచి అప్డేట్స్ ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.













