NBK109 లో హైలైట్ సీన్స్ అవేనట
భగవంత్ కేసరి తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో బాలయ్యను బాబీ ఎలా చూపించబోతున్నాడు? సినిమాలో బాలయ్య లుక్ ఎలా ఉంటుందనేది ఫ్యాన్స్ లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ అప్డేట్ తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రస్తుత షెడ్యూల్ లో ఇంటర్వెల్ కు ముందు వచ్చే సీన్స్ ను షూట్ చేస్తున్నారట. ఇందులో భాగంగా బాలయ్య పై కొన్ని భారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
బాలయ్య సినిమాల్లో మామూలుగానే ఇంటర్వెల్ సీన్స్ ఓ రేంజ్ ఉంటాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలయ్య మాస్ ఫాలోయింగ్‌లో అరుపులు పెట్టించేలా ఆ సీన్స్ ఉంటాయి. ఇప్పుడు బాబీ ఆ సీన్స్ ను అంతకు మించి ఉండేలా ప్లాన్ చేశాడట. దానికి తగ్గట్టే ఇంటర్వెల్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్లు ఉంటాయని యూనిట్ వర్గాల నుంచి తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనుండగా, బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు.













