దేవర టీమ్‌కు న్యూ ఇయర్ హాలిడేస్
ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, తన తర్వాతి సినిమా దేవరను కొరటాల శివతో చేస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ దేవరతో టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించనున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది కొరటాల ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు.
వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి గ్యాప్ లేకుండా జరుగుతుంది. షెడ్యూల్‌కు, షెడ్యూల్‌కూ మధ్య వారం రోజులకు మించి ఎక్కువ గ్యాప్ ఎప్పుడూ తీసుకోలేదు. అయితే ఇప్పుడు మొదటిసారి దేవర టీమ్ మొత్తం బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
దేవర టీమ్ కు న్యూ ఇయర్ హాలిడేస్ ఇచ్చారట. ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు వెకేషన్‌కు వెళ్లనున్నాడట. ఈ నేపథ్యంలోనే దేవర షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. ఇప్పటికే రెగ్యులర్ షెడ్యూల్స్ తో టీమ్ అలసిపోవడంతో ఎన్టీఆర్ తో పాటూ టీమ్ మొత్తానికి ఈ బ్రేక్ అవసరమని భావించి మేకర్స్ ఇలా హాలిడేస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తిరిగి వెకేషన్ నుంచి వచ్చాక ఈ సినిమా షూటింగ్ జరగనుంది. జవనరిలో దేవర షూటింగ్ పూర్తయ్యే ఛాన్సుంది.













