శంకర్ ఇకనైనా క్లారిటీ ఇస్తే బెటర్
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత వెంటనే రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమా అనౌన్స్ చేసేసరికి మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు. కానీ వారి సంతోషాలను ఆవిరి చేస్తూ డైరెక్టర్ శంకర్ వాళ్ల ఓపికను పరీక్షిస్తున్నాడు. సినిమా మొదలై మూడేళ్లవుతున్నా ఇప్పటికీ గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి కాలేదు. అందుకే రిలీజ్ డేట్ విషయంలో ఏ క్లారిటీ రావడం లేదు.
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ క్లైమాక్స్ దశలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గేమ్ ఛేంజర్ ను అక్టోబర్ లో రిలీజ్ చేయాలనేది నిర్మాత దిల్ రాజు ప్లాన్. దేవర ఎలాగూ అక్టోబర్ ను వదులుకుని సెప్టెంబర్ 27కు వెళ్లింది. దీన్ని వాడుకోవాలే కానీ మంచి అడ్వాంటేజ్ అవుతుంది. అక్టోబర్ లోనే రజినీకాంత్ వెట్టయాన్ ఉంది కానీ రెండు వారాల గ్యాప్ ఉంటే చాలనేది దిల్ రాజు అభిప్రాయం.
కానీ శంకర్ మాత్రం ఏదీ తేల్చడం లేదు. ఆయన దర్శకత్వంలో వస్తోన్న ఇండియన్2 రిలీజ్ కు ఇంకా నెల రోజుల టైమ్ కూడా లేదు. ఇండియన్2కు రావాల్సిన బజ్ ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలో శంకర్ ప్రమోషన్స్ కు ఎలా ప్లాన్ చేస్తుందో తెలియదు. కొంపతీసి పుష్ప2 స్లాట్ కు పోస్ట్ పోన్ చేస్తే లేని పోని తలనొప్పి. ఇవన్నీ కాదని గేమ్ ఛేంజర్ ను డిసెంబర్ కు ప్లాన్ చేద్దామంటే అదే నెలలో పుష్ప2 వస్తోంది. ఏదేమైనా గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కు శంకర్ ఇకనైనా మోక్షం కలిగిస్తే బెటర్.













