సుధీర్ బాబుకు కొత్త ట్యాగ్
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదటి నుంచే విభిన్న సినిమాలు చేస్తున్న సుధీర్ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. అయితే గత కొంత కాలంగా సుధీర్ కు అసలు కలిసిరావడం లేదు. ఎంత కష్టపడినా సక్సెస్ మాత్రం దక్కడం లేదు.
సుధీర్ బాబు హీరోగా డైరెక్టర్ జ్ఞాన సాగర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా హరోం హర. కుప్పం బ్యాక్ డ్రాప్ లో 1980ల్లో జరిగిన రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇవాళే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రీమియర్స్, ఫస్ట్ షో నుంచి సినిమాకు డీసెంట్ టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సుధీర్ కు గతంలో నైట్రో స్టార్ అనే ట్యాగ్ లైన్ ఉండేది.
గత కొన్ని సినిమాలుగా ఆయన సినిమాల్లో తన పేరుకు ముందు ఇదే ట్యాగ్ వేస్తున్నారు. కానీ హరోం హర ప్రమోషన్స్ లో డైరెక్టర్ జ్ఞాన సాగర్, సుధీర్ బాబుకు కొత్త ట్యాగ్ ఇస్తున్నామని, సినిమా రిలీజయ్యాకే అదేంటో తెలుస్తోందని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు సినిమా రిలీజైపోయింది. టైటిల్స్ లో సుధీర్ పేరుకు ముందు నవ దళపతి అని పడింది. అంటే ఇకపై సుధీర్ ముందు ఈ ట్యాగే ఉండనుందన్నమాట. రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్స్ లోనే సుధీర్ తనకు నైట్రో స్టార్ అనే ట్యాగ్ ఇష్టం లేదని చెప్పాడు. అందుకే చిత్ర మేకర్స్ సుధీర్ ట్యాగ్ ను మార్చి ఉండొచ్చు. మరి నవ దళపతి అనే కొత్త ట్యాగ్ సుధీర్ కు ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.













