కల్కి కోసం కొత్త రిలీజ్ డేట్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం కల్కి 2898ఏడి. మేకర్స్ అనౌన్స్ చేసిన ప్రకారమైతే కల్కి మే 9న రిలీజ్ కావాలి. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి నెట్టింట రోజుకో వార్త ప్రచారమవుతుంది. రిలీజ్ డేట్ లో మార్పు గురించి మేకర్స్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.
ఇప్పటికైతే మే 9న రిలీజ్ చేయాలనే ఆలోచనతోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తుంది టీమ్. కానీ రిలీజ్ లోపు ఈ పనులు పూర్తవడం కష్టమంటున్నారు. మరోవైపు ఏపీలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. నాలుగు రోజుల్లో ఎలక్షన్స్ పెట్టుకుని సినిమాలకు వచ్చేంత పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఉండవు. కచ్ఛితంగా సినిమా ఓపెనింగ్స్ మీద ఆ ప్రభావం ఉంటుందని బయ్యర్లు చెప్పిన మాటలను టీమ్ పరిగణలోకి తీసుకుని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, కల్కి సినిమా కోసం మే 30వ తేదీని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ సమ్మర్ హాలిడేస్ జూన్ మూడో వారం వరకు ఉంటాయి కాబట్టి ఓపెనింగ్స్, కలెక్షన్లకు ఢోకా ఉండదు. ఏపీలో మే 30 లోపు కొత్త ప్రభుత్వం కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. సో ఇదే బెస్ట్ డేట్ అని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఏదేమైనా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఓ క్లారిటీ ఇస్తే అన్ని విధాలా బావుంటుంది.













