Sai Pallavi: సాయి పల్లవికి కొత్త సమస్య

సాయి పల్లవి(sai pallavi) కథలు, తన పాత్రల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. కథ బావుండి, తన పాత్రకు ప్రాధాన్యం లేకపోయినా సాయి పల్లవి ఎంత పెద్ద సినిమానైనా సరే నో అనేస్తుంది. చిరంజీవి(chiranjeevi)తో కలిసి భోళా శంకర్(bhola shankar) లో అతని చెల్లి పాత్ర వచ్చినా ఆ పాత్రను సాయి పల్లవి రిజెక్ట్ చేయడానికి కారణమదే. అలాంటి సాయి పల్లవికి ఇప్పుడు ఓ ప్రాబ్లమ్ వచ్చింది.
ప్రస్తుతం ఈ ఫిదా(fidaa) భామ బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి రణ్‌బీర్ కపూర్(ranbir kapoor) సరసన చేస్తున్న రామాయణం (ramayanam) కాగా మరోటి ఆమిర్ ఖాన్(aamir khan) కొడుకు జునైద్ ఖాన్(junaid khan) తో నటిస్తున్న సినిమా. ఈ రెండింట్లో రామాయణంతో సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ జరిగితే అదొక స్వీట్ మెమొరీలా ఉండేది కానీ ఇప్పుడు జునైద్ నటిస్తున్న సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఏక్ దిన్(ek din) అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి బజ్ లేదు. దానికి తోడు జునైద్ ఖాన్ పై ఆడియన్స్ కు మంచి ఒపీనియన్ లేదు. అతన్నుంచి గతంలో వచ్చి మహారాజ(maha raja), లవ్ యాపా(love yapa) సినిమాలు డిజాస్టర్లుగా నిలవడంతో పాటూ జునైద్ యాక్టింగ్ గురించి కూడా విమర్శలొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏక్ దిన్ కోసం ఆడియన్స్ థియేటర్లకు రావడం కష్టమే. ఎన్నో స్క్రిప్టులు విని ఎన్నో ఆలోచించి సాయి పల్లవి బాలీవుడ్ లో సినిమా ఒప్పుకుంటే ఇప్పుడు ఆ సినిమాకు ఇలాంటి ఇబ్బందులు రావడమేంటో అని ఆమె ఫ్యాన్స్ బాధ పడుతున్నారు.