నేను రజనీతో….నమ్మలేకపోతున్నా!
రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం పేట. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష, సిమ్రాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ పోస్టర్ను విడుదల చేసింది. రజనీ కాంత్, సిమ్రాన్ పూల కుండీలు పట్టుకొని నడిచొస్తున్నట్టుగా ఉన్న ఆ పోస్టర్ అభిమానుల్ని అలరిస్తోంది. ఈ పోస్టర్ను సిమ్రాన్ కూడా సోషల్ మీడియాలో పంచుకొన్నారు. చాలా సంతోషంగా ఉంది. నేను రజనీతో నటించానంటే నమ్మలేకపోతున్నాను. నన్ను నేనే గిల్లుకున్నాను అంటూ ట్వీటారు సిమ్రాన్. విజయ్ సేతుపతి, బాబీ సింహా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు అందిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రజనీ నటించిన 2.ఓ ఈ నెల 29న విడుల కానుంది.













