బిగ్ బాస్ కి కొత్త హోస్ట్..నాగార్జునని రీప్లేస్ చేసేది ఎవరు..?
ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ షో కి చాలా క్రేజ్ ఉంది. హిందీలో అయితే ఈ షో చాలా పాపులర్ అయ్యింది. అక్కడి ప్రేక్షకులు బిగ్ బాస్ ని విపరీతంగా ఆదరించారు. ఇప్పటికి ఆదరిస్తూనే ఉన్నారు. ఇండియాలో అత్యధిక రేటింగ్ సాధించిన షోస్ లో హిందీ బిగ్ బాస్ ఒకటి అని చెప్పొచ్చు. అలాంటి షో ని తెలుగు లో సైతం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ తెలుగు ఫస్ట్ సిరీస్ కి ఎన్టీఆర్ హోస్టుగా చేసారు. ఒక్క సీజన్ తో ఎన్టీఆర్ వల్ల బిగ్ బాస్ కి ఫుల్ క్రేజ్ వచ్చింది. సీజన్ వన్ తర్వాత వచ్చిన బిగ్ బాస్ సీజన్ 2 కి నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఎన్టీఆర్ లాగానే నాని కూడా బిగ్ బాస్ జర్నీలో ఒక్క సీజన్ కే డ్రాప్ అయ్యారు.
ఇక మూడవ సీజన్ నుండి తెలుగు బిగ్ బాస్ బాధ్యతలు కింగ్ నాగార్జున తీసుకున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ సిక్స్త్ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు టెలివిజన్ సీజన్స్ తో పాటు ఒక ఓటీటీ సీజన్ కూడా నాగ్ హోస్టుగా కొనసాగింది. ఇటీవల వస్తున్న వార్తల ప్రకారం నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కి హోస్ట్ గా వ్యవహరించడానికి ఆసక్తిగా లేరట.
బిగ్ బాస్ వల్ల సినిమాలకి న్యాయం చేయలేకపోతున్నాని నాగ్ ఫీల్ అవుతున్నారట. నాలుగు నెలల పాటు ఉండే షూటింగ్ వల్ల సినిమా షూటింగ్స్ కి ఇబ్బంది అవుతుందట. అందుకే ఆఖరికి బిగ్ బాస్ ని వదిలేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ నేపథ్యంలో నెక్స్ట్ సీజన్ కి హోస్ట్ ని వెతికే పనిలో ఉన్నారట బిగ్ బాస్ టీమ్.
సీనియర్ స్టార్స్ ని మొదలుకొని పలువురు యంగ్ స్టార్ హీరోల పేర్లు పరిశీలనకు ఉన్నాయట. చిరంజీవి.. బాలకృష్ణ.. విజయ్ దేవరకొండ.. మహేష్ బాబు ఇలా ఎంతో మంది పేర్లు ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ ఎవరు అనేది క్లారిటీ లేదు. న్యూ హోస్ట్ ఎవరా ? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.













