HHVM: వీరమల్లుకు కొత్త వివాదం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమా హరిహర వీరమల్లు(Harihara Veeramallu). ఎప్పుడో కరోనాకు ముందు మొదలైన ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్నారు. హిస్టారికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను ముందు క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) మొదలుపెట్టి, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.
దీంతో మిగిలిన సినిమాను ఏఎం జ్యోతికృష్ణ(AM Jyothikrishna) పూర్తి చేశారు. మొత్తానికి ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమా జులై 24న రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ ప్రస్తుతం వీరమల్లు యుఫోరియాను ఎంజాయ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు ఓ కొత్త వివాదంలో చిక్కుకుంది.
ఈ మూవీలో పవన్ కళ్యాణ్ చేస్తున్న వీరమల్లు క్యారెక్టర్ తెలంగాణ యోధుడు పండుగ సాయన్న(Panduga Sayanna) లైఫ్ కు దగ్గరగా ఉందని, కానీ ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఎక్కడా రివీల్ చేయడం లేదని పలు బహుజన సంఘాలు విమర్శిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో వీరమల్లు పాత్ర ఎవరిని స్పూర్తిగా తీసుకుని రాసుకున్నారో చెప్పాలని మేకర్స్ ను ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా వీరమల్లు సినిమా జులై 24న రిలీజ్ కానుంది.