ఆకట్టుకుంటున్న న్యూ ఏజ్ కమెడియన్స్
టాలీవుడ్ లో కమెడియన్ల కొరత బాగానే ఉంది. అలా అని తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ లేదని కాదు. ఉన్న వాళ్లను వాడుకునే రీతిలో డైరెక్టర్లు మంచి కంటెంట్ రాసుకోవడం లేదు. సరైన క్యారెక్టర్ పడితే న్యూ ఏజ్ కమెడియన్స్ ఎలా చెలరేగిపోతారో రీసెంట్ గా వాళ్లు నటించిన సినిమాలే చెప్తున్నాయి. ఆయ్ సినిమాలో కమెడియన్ గా ఆడియన్స్ ను నవ్వించే భారం మొత్తాన్ని రాజ్ కుమార్ కసిరెడ్డినే తీసుకున్నాడు.
చాలా సీన్స్ లో హీరో హీరోయిన్లను డామినేట్ చేసి మరీ నవ్వులు పూయించాడు. ఆ పాత్రలో వేరే ఆర్టిస్టుని ఊహించుకోవడం కూడా కష్టమనేలా ఆ పాత్రను చేశాడతను. యూత్ కు రాజ్ కుమార్ బాగా కనెక్టయ్యాడు. రీసెంట్ టైమ్ లో అతనికి దొరికిన పెద్ద బ్రేక్ ఇదే. ఇక కమెడియన్ సత్య గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. కాసేపు ఉన్నా సరే తన మార్క్ కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తాడు.
జాతిరత్నాలు సినిమా టైమ్ లో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా ఇదే తరహాలో కనిపించారు కానీ తర్వాత ప్రియదర్శి హీరో అయ్యాక వేరే హీరోల పక్కన పాత్రలు చేయడం మానేశాడు. రాహుల్ మాత్రం వచ్చిన ఛాన్సులు అందుకుంటూ మెప్పిస్తున్నాడు. వెన్నెల కిషోర్ ఈ మధ్య రొటీన్ పాత్రలు చేస్తున్నా సరైన క్యారెక్టర్ పడితే మాత్రం రఫ్ఫాడించేస్తాడు. వైవా హర్షకు మంచి క్యారెక్టర్లు పడటం లేదు. అభినవ్ గోమటం కూడా మంచి నటుడే. బిత్తిరి సత్తి కొన్ని సినిమాల్లో మెరిసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఏదేమైనా వారిని సరిగా వాడుకునే బాధ్యత డైరెక్టర్ల మీదే ఉంది.













