ఆ యాడ్ సమంత చేయొద్దు
స్టార్ హీరో హీరోయిన్స్ కొన్ని ప్రొడక్ట్స్‌కి బ్రాండ్ అంబాసిండర్‌గా వ్యవహరించడం సర్వసాధారణం. అందుకుగానూ వారికి భారీ స్థాయిలోనే పారితోషికాలు అందుతుంటాయి. దాంతో కొంతమంది స్టార్స్ వెనుకాముందు ఆలోచించకుండా కొన్ని అభ్యంతరకరమైన ప్రొడక్ట్స్ కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి విమర్శల పాలవుతుంటారు. గతంలో చిరంజీవి థమ్ఆప్స్ యాడ్‌కు వచ్చినప్పుడు విమర్శలు తలెత్తాయి. అప్పుడు అంతా సోషల్ మీడియా ఉపందుకోలేదు. తాజాగా సమంత కుర్ కురే ప్రొడక్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించబోతున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపారు. ఆరోగ్యానికి హానికరమైన ఇలాంటి ప్రొడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎలా వ్వహరిస్తారు అంటూ కొంతమంది నెటిజన్లు సమంతకు ట్వీట్స్ పెడుతున్నారు. డబ్బు కోసం ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తావా.. దయచేసి చెయ్యొద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ ట్వీట్ట్కి సమంత ఎలా స్పందిస్తోందో చూడాలి.













