NBK-Rajsekhar: బాలయ్య ను వదిలేసి రాజశేఖర్ ను వైరల్ చేస్తున్న నెటిజన్లు
సోషల్ మీడియా వాడకం నానాటికీ బాగా పెరిగిపోతుంది. ఈ కారణంతో ఎప్పుడో మరుగున పడిన విషయాలు కూడా కొన్ని సడెన్ గా ట్రెండ్ అవడం చూస్తున్నాం. ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. సీనియర్ హీరో రాజశేఖర్(rajasekhar) నటించిన ఆయుధం(Aayudham) సినిమా రిలీజైన టైమ్ లో ఫ్లాప్ గా నిలిచింది. సినిమా ఫ్లాపవడంతో ఆ సినిమాలోని సాంగ్స్ కు కూడా పెద్దగా గుర్తింపు రాలేదు.
కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఆయుధం మూవీలోని సాంగ్ ఒకటి ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటించిన తాజా సినిమా కె ర్యాంప్(K Ramp) లో ఆయుధం లోని ఇదేమిటమ్మా మాయ సాంగ్ బిట్ ఉంటుంది. సినిమాలో ఆ సాంగ్ బిట్ ను చూసిన నెటిజన్లు ఆ సాంగ్ కు రీల్స్ చేస్తూ దాన్ని నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.
అయితే కె ర్యాంప్ సినిమాలో ఆ సాంగ్ తో పాటూ బాలకృష్ణ(balakrishna) నటించిన సమరసింహా రెడ్డి(Samara simha reddy) లోని నందమూరి నాయక(nandamuri nayaka) సాంగ్ కూడా ఉంది. కానీ జెన్ జీ నెటిజన్లు మాత్రం రాజశేఖర్ ఫ్లాప్ సినిమాలోని సాంగ్ కే ఓటేసి దాన్నే ట్రెండ్ చేశారు. అందుకే అంటారు సోషల్ మీడియాలో ఏది ఎప్పుడు ఎలా పాపులర్ అవుతుందో ఎవరికీ తెలియదు అని. మొత్తానికి చాలా ఏళ్లుగా మరుగున పడిన సాంగ్ సోషల్ మీడియా పుణ్యమా అని వైరల్ అయింది.







