“సార్” ఓటీటీ హక్కులని సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్..
తమిళ సూపర్ స్టార్ ధనుష్ మొదటి సారి తెలుగులో డైరెక్ట్ మూవీ సార్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఇప్పటివరకు డబ్బింగ్ మూవీస్ తోనే టాలీవుడ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకున్న ధనుష్, ఇప్పుడు తెలుగు స్ట్రైట్ సినిమాతో తనని తాను సరికొత్తగా పరిచయం చేసుకుంటున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యంగ్ టాలెంటెడ్ అప్ కమింగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈరోజే థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
ఆల్రెడీ రైటర్ గా, డైరెక్టర్ గా తానేంటో టాలీవుడ్ లో ప్రూవ్ చేసుకున్నాడు వెంకీ అట్లూరి. ధనుష్ లాంటి ఒక స్టార్ హీరోతో చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగా ఎక్స్పెక్టషన్స్ పెట్టుకున్నారనే చెప్పాలి. డిఫరెంట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఇటు ఫాన్స్, అటు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ప్రముఖ టెలివిషన్ సంస్థ జెమినీ టీవీ పొందినట్లు సమాచారం అందుతుంది. శాటిలైట్ హక్కులని సొంతం చేసుకోవటానికి భారీ మొత్తాన్నిపే చేసినట్లు తెలుస్తుంది.
ఈ మధ్య కాలం లో రిలీజైన ప్రతి సినిమాని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కూడా విడుదల చేయడం తెలిసిన విషయమే. తాజాగా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సార్ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకుంది. ధనుష్ క్రేజ్ కి తగ్గట్లు గానే చాల పెద్ద మొత్తంలో సార్ సినిమాని కొనుగోలు చేసిందట నెట్ ఫ్లిక్స్. ఈసారి డిఫరెంట్ కథ కథనాలతో ధనుష్ ప్రేక్షకుల ముందుకి వచ్చాడని చెప్పాలి. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా కూడా ఇటు తెలుగు, అటు తమిళంలో హీరో ధనుష్ పై ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.













