నేను లేను టీజర్ విడుదల
లాస్ట్ ఇన్ లవ్ శీర్షికతో నేను లేను సినిమా రూపొందుతోంది. హర్షిత్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ అందమైన ప్రేమకథతో సైనలాజికల్ థ్రిల్లర్‌గా తెరెక్కిస్తున్నాం. చిత్రీకరణ పూర్తయింది. డిటిఎస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదే నెలలో పాటలను విడుదల చేస్తాం. కథనం, సంగీతం, ఛాయాగ్రహణం మా సినిమాకు ఆకర్షణగా నిలుస్తాయి అని చెప్పారు. హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, బిశ్వజిత్ నాథ్, రుద్రప్రకాశ్, యుగంధర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అశ్రీత్, ఛాయాగ్రహణం: ఎ.శ్రీకాంత్, సహ నిర్మాత: యాషిక, రచన, దర్శకత్వం : రామ్ కుమార్ ఎమ్.ఎస్.కె.













