ఈ నెల 8న నేనే ముఖ్యమంత్రి
దేవి ప్రసాద్, వాయు తనయ్, శశి, సుచిత్ర ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం నేను ముఖ్యమంత్రి. మోహన్ రావిపాటి దర్శకుడు. అట్లూరి నారాయణరావు, ఆల్లూరి సాంబశివరావు నిర్మాతలు. ఈ నెల 8న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే చిత్రమిది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం జరిగే పోరాటంలోని మలుపులు ఆకట్టుకుంటాయి. చివరికీ ఆ పీఠాన్ని అధిరోహించేదెవరో ఆసక్తికరంగా చూపించాం. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చిందన్నారు. నళినికాంత్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఫణి కల్యాణ్, కెమెరా: కమలాకర్.













