‘నేల టిక్కెట్టు’ మూవీ టీజర్ విడుదల
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రవితేజ తాజా చిత్రం ‘నేల టిక్కెట్టు’ మూవీ టీజర్ ని ఆదివారం యూనిట్ విడుదల చేసింది. ‘ చుట్టూ జనం..మధ్యలో మనం.. అలా ఉండాలిరా లైఫ్ అంటే ! నేల టికెట్ గాళ్ళతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు ‘ అని రవితేజ చెప్పిన డైలాగ్ ని ఇందులో హైలైట్ చేశారు. హీరోయిన్ మాళవిక శర్మ..’ ఏరా ! తినేస్తావా ? ‘ అని తిడుతున్నప్పుడు మాస్ మహారాజా భావాలు ఫన్నీగా ఉన్నాయి. జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. శశికాంత్ కార్తీక్ మ్యూజిక్ డైరెక్టర్.













